ములుగు: ములుగు జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం సృష్టించింది. కోర్టు ప్రాంగణంలో 25 చిన్న ౖసైనెడ్ గ్యాస్ బాంబులను సోమవా రం పేల్చనున్నట్లు ఆదివారం జిల్లా కోర్టుకు మెయి ల్ చేశారు. తమిళ మంత్రి సెంథిల్ బాలాజీపై ఉన్న సీబీఐ కేసులను ఉపసంహరించుకోవాలని ఆ మె యిల్‌లో పేర్కొన్నారు. ఆదివారం సెలవుదినం కా వడంతో అధికారులు మెయిల్‌ను చూడలేదు. సోమవారం విధులకు హాజరైన కోర్టు అధికారులు మెయిల్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు జిల్లా కోర్టుకు చేరుకుని న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందిని సు రక్షిత ప్రాంతానికి తరలించి కోర్టు ప్రాంగణాన్ని త మ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీమ్‌తో కోర్టులోని ప్రతీ ప్రదేశాన్ని త నిఖీ చేశారు. ఇందులో బాంబు లభ్యంకాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మెయిల్ ఎ క్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? ఇది ఆకతాయిల పనా? లేక ఏదైనా కుట్ర ఉందా అనే కో ణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తె లంగాణలో పలు జిల్లా కోర్టులకు బెదిరింపుల కలకలం రేపగా, సోమవారం ములుగు జిల్లా కోర్టుకు కూడా అలాంటి హెచ్చరిక రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో కోర్టు పరిస రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
డాగ్ స్క్వా డ్, బాంబు డిస్పోజల్ టీమ్‌తో పోలీసుల తనిఖీలు
లభ్యంకాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికార యంత్రాంగం


