కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్. లింగమూర్తి సేవలు చిరస్మరణీయమని, అనేక పరిపాలన పదవులు నిర్వర్తించి గొప్పపాలనాదక్షుడిగా పేరుగడించారని కేయూ వీసీ కె. ప్రతా ప్‌రెడ్డి అన్నారు. ఇటీవల మృతి చెందిన ప్రొఫెసర్ ఎన్. లింగమూర్తి యాదిసభను సోమవారం తెలంగాణ పూలే ఆశయసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సంగానిమల్లేశ్వర్ అధ్యక్షతన జర్నలిజం విభా గం సెమినార్‌హాల్‌లో నిర్వహించారు. ఈ సభలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తు తం యూనివర్సిటీలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల్లో లింగమూర్తి నియమించిన వారే 50శాతం మంది ఉండడం ఆయన పనితీరుకు గొప్ప నిదర్శనమన్నారు. ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ విద్యావేత్తగా, పరిపాలకుడిగా లింగమూర్తి ఆదర్శవంతమైన సేవలు అందించారని కొనియాడారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ ఇక్బాల్ అలీ, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, కేయూ రిటైర్డ్ అధ్యాపకుల సంఘం జనరల్‌సెక్రటరీ వడ్డె రవీందర్, రిటైర్డ్ ప్రొఫెసర్లు గజ్జెల రామేశ్వరం,తౌటం శ్రీనివాస్, ఎం. సారంగపాణి, కేయూ పాలకమండలి సభ్యులు చిర్రరాజు, రమ, పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి చందామల్ల య్య, ఉపాధ్యక్షులు మెరుగు బాబుయాదవ్, జిల్లా అధ్యక్షుడు తాడూరి శాస్త్రి, కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు మాట్లాడారు.
కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి


