● వనపర్తిలో ఘటన
లింగాలఘణపురం : ఓ రైతు వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వనపర్తిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దూరు మల్లయ్య (64) సోమవారం ఉద యం బావి వద్దకు వెళ్లి చెలుకలో గుంటుక తోలు తూ అక్కడే మృతి చెంది ఉన్నాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన మల్లయ్య మధ్యాహ్నం వరకు రాకపోవడంతో అతడి భార్య అండాలు ఫోన్ చేసింది. ఎత్తకపోవడంతో అనుమానంతో బావి వద్దకు వెళ్లి చూడగా గుంటుక వద్దే చెలుకలోనే మృతి చెంది కనిపించాడు. గెట్ల పంచాయితీలో ఎవరైనా చంపారా..? లేదా గుండెపోటు వచ్చిందా? ఎద్దు తన్నితే చనిపోయాడా అనే అనుమానం నెలకొంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్ తెలిపారు.
కల్తీ, కాలం చెల్లిన ఉత్పత్తులపై టాస్క్‌ఫోర్స్ కొరడా
● రూ.1,06,940 విలువైన ప్రొడక్ట్స్ స్వాధీనం
గీసుకొండ: వరంగల్ గొర్రెకుంటకు చెందిన వెల్ మార్క్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌లో గడువు దాటిన, పాడైన ఉన్న దాదాపు 16 రకాల రూ.1,06,940 వి లువైన ఉత్పత్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. టాస్స్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సార్ల రాజు సిబ్బందితో మార్క్ కంపెనీ నడుపుతున్న కింగ్ స్టన్‌కు చెందిన తయారీ, డిస్ట్రిబ్యూషన్ గోదాంలో దాడులు నిర్వహించారు. ఇందులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వివిధ రకాల స్వీట్లు, ఖారా, మురుకులు, లాలిపాప్స్, మ్యాంగో, ఫ్రూటీ, కాజా ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాశిబు గ్గకు చెందిన కంపెనీ ఓనర్ కింగ్ స్టన్‌తోపాటు సీజ్ చేసి ప్రాపర్టీని తదుపరి చర్యల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తికి అప్పగించారు.


