హన్మకొండ: డిజిటల్ టెక్నాలజీ, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఫీల్డ్ ఇన్నోవేషన్స్ వినియోగించి విద్యుత్ సరఫరా మెరుగుపరచడం, అంతరాయాలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న నేపథ్యంలో టీజీ ఎన్పీడీసీఎల్ అవార్డులు అందుకుంటుందని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఇటీవల న్యూ ఢిల్లీలో అందుకున్న అవార్డులను సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ సెక్రటరీ.. సీఎండీ, డైరెక్టర్లకు అందించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఆటోమేషన్ డిజిటల్ టెక్నాలజీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 12వ పీఎస్‌యూ ఎక్సలెన్స్ అవార్డు, ఇన్నోవేషన్ విభాగంలో ఇప్పా యి అవార్డు లభించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ నిరంతర పర్యవేక్షణ, మార్గదర్శకంలో ఈ అవార్డులు ఎన్పీడీసీఎల్‌కు రావడం గర్వంగా ఉందన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు రాజుచౌహాన్, అశోక్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎం శ్రీనివాస్, డి.ఈలు అనిల్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


