అప్పు తిరిగి చెల్లించడంలో తీవ్ర జాప్యం
స్త్రీనిధి
రుణం..
సాక్షి, మహబూబాబాద్: స్వయం సహాయక సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. అయితే స్త్రీనిధి రుణాలు తీసుకున్న సంఘాలు తిరిగి సకాలంలో చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. కాగా, ఈ ఏడాది కొత్త రుణాల లక్ష్యాలను చేరుకోవడంలో పాత బకాయిలు కొరగాని కొయ్యగా మారాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతీ నెల కిస్తీలు సక్రమంగా చెల్లించేలా చూడాల్సిన అధికారుల ఉదాసీనతే ఇందుకు కారణమని, దీంతో మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని ఉన్నత అధికారులు అంటున్నారు.
ఇచ్చిన రుణాలు ఇలా..
మహిళలు చేతి వృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకునేందుకు, వ్యవసాయ పెట్టుబడులకు స్త్రీనిధి రుణాలు అందజేస్తారు. ఇందులో సువిధ, ప్రగతి, అక్షయ, సౌభాగ్య, ఐశ్వర్య పేరిట రుణాలు ఇస్తారు. ఇందులో వారి ఆర్థిక పరిస్థితి, పెట్టే యూనిట్ ఆధారంగా రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు రుణాలు ఇస్తారు. అయితే ఇందులో రూ. 50వేల లోపు రుణా లు 48గంటల్లో అందజేస్తారు. ఈ రుణాలకు ప్రతీ నెల కిస్తీల రూపంలో చెల్లించాలి.
రికవరీలో జాప్యం..
వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో పలువురు మహిళలు జాప్యం చేస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 571 గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో 6,981 సంఘాలు, 32,473 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో గతంలో తీసుకున్న రుణాలు రూ.80కోట్లు ఉండగా ఇందులో రూ. 50కోట్లు వసూలు కాగా.. రూ. 30కోట్లు బకాయి పడ్డారు. ఇందులో రెగ్యులర్ బకాయిలు రూ. 20.905కోట్లు ఉండగా.. మొండి బకాయిలు మాత్రం రూ.10కోట్ల మేరకు ఉంటాయి. ఇందులో ప్రధానంగా మరిపెడ మండలంలో అ త్యధికంగా రూ.4.70కోట్లు, గూడూరు రూ.1.70కోట్లు, గార్ల రూ.1.20కోట్లు, బయ్యారం రూ. 2.22కోట్లు ఉండడం గమనార్హం. అదే విధంగా జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్ మున్సిపాలిటీల పరిధిలో 81 ఎస్‌ఎల్‌ఎఫ్‌ల్లో 1040 సంఘాలు, అందులో 6,774 మంది సభ్యులు ఉన్నారు. వీరు తీసుకున్న రుణాల్లో మొత్తం రూ.15కోట్లకు గాను.. రూ.3కోట్ల మేరకు బకాయి పడ్డారు. ఇందులో రెగ్యులర్ రికవరీ రూ.1.88కోట్లు ఉంది. మిగిలిన రూ. 1.12కోట్లు మొండి బకాయి పడ్డారు.
అధికారుల ఉదాసీనత..
రుణాల రికవరీలో కీలక పాత్ర పోషించాల్సిన అధికా రుల ఉదాసీనత వల్లే బకాయిలు పెరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గ్రామ స్థాయిలో సీఏలు, మండల స్థాయి సెర్ప్ అధికారులు, మున్సిపాలిటీల పరిధి లో మెప్మా, జిల్లా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఆర్పీలు, సీఏలు మహిళల పేరిట రుణాలు తీసుకొని సొంత అవసరాలకు వాడుకోవడం, ఇందుకోసం అధికారులకు మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఫిర్యాదులు ఉ న్నాయి. దీంతో కొన్ని సంఘాలు సకాలంలో కిస్తీలు చెల్లించకపోయినా.. పట్టించుకోవడం లేదని, అందుకోసమే మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని సీ్త్రని ధి అధికారులు చెబుతున్నారు.
రికవరీ వేగవంతం చేస్తున్నాం..
జిల్లాలో సీ్త్ర నిధి రుణాల బకాయిలు పేరుకుపోయిన మాట వాస్తవమే. సంఘాల సభ్యుల నుంచి సకాలంలో డబ్బులు రికవరీ చేయించడంలో కొందరు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.56కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు రూ.34కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చాం. రుణాలు చెల్లించడంలో బకాయి పడిన 2,600 సంఘాలకు నోటీసులు ఇచ్చాం. సకాలంలో రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని కోరుతున్నాం. మొండి బకాయిల కోసం రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నాం.
–ఎస్.మధు, సీ్త్రనిధి జిల్లా బాధ్యులు
●
కొత్త రుణాల టార్గెట్‌కు బకాయిల అడ్డంకి..
అధికారుల ఉదాసీనతతో రికవరీలో వెనకడుగు
పలు సంఘాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు


