విత్తనాలు ఇచ్చే ముందు ఎంతో తియ్యగా మాట్లాడి పంట దిగుబడి రావడం లేదని ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు. రెండు ఎకరాల్లో రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేటట్లు లేదు. మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలి.
– తాటి కొమ్మయ్య, రైతు
కౌలు కూడా వచ్చేలా లేదు
ఎకరం చెలక నాలుగు వేలకు మునాబా(కౌలు)కు తీసుకుని ఆర్గనైజర్ మాటలు నమ్మి ఈజొన్న వేసిన. అసలు కంకులే రాలేదు. మొత్తం క్వింటా కూడా అయితయో కావో. మునాబా డబ్బులు, ఎరువులు, పురుగుమందులు, దున్నకం కూళ్లు అన్ని మీద పడుతున్నాయి. పరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– బానోతు శారద, మహిళా రైతు
●


