దిగుబడి వస్తుందని, క్వింటాకు రూ.3500 చెల్లించి కొనుగోలు చేస్తామని చెప్పిన మాట వాస్తవమే. దిగుబడి రాకపోతే పరిహారం ఇస్తామని చెప్పలేదు. ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు. ఇచ్చిన విత్తనాలు వంద రోజుల పంట కాల పరిమితి ఉంటుంది. అందుకు తగినవిధంగా యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల దిగుబడి రాలేదు.
– కత్తుల కుమార్, ఆర్గనైజర్
దిగుబడి వస్తుందని నమ్మించారు..
దిగుబడి వస్తుందని నమ్మించారు. రెండు ఎకరాల్లో విత్తనాలు వేసిన దగ్గర నుంచి నీళ్లు పెట్టిన ప్రతీసారి మొక్కలు చనిపోతున్నాయి. విషయం చెబితే ఎన్నో రకాల మందులు పిచికారీ చేయించారు. అయినా ఫలితం లేదు. తీవ్రంగా నష్టం జరిగింది. కనీసం దున్నిన కూళ్లు కూడా వచ్చేలా లేవు. కంపెనీ వారు ఆదుకోవాలి.
– వాసం పాపయ్య, రైతు
●


