దళిత యువతకు దన్ను.. | - | Sakshi
Sakshi News home page

దళిత యువతకు దన్ను..

Mar 23 2026 8:54 AM | Updated on Mar 23 2026 8:54 AM

న్యూశాయంపేట : దళిత నిరుద్యోగ యువత తమ కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీపై ఎలక్ట్రిక్‌ వాహనాలు అందించి వారి స్వయం ఉపాధికి బాటలు వేయనుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరల భారం పడకుండా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, ఆటోలు, సోలార్‌ కంట్రోల్‌ పంపు యూనిట్ల పంపిణీ చేయనుంది. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా రవాణా రంగంలో రాణించేలా ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశం. ముఖ్యంగా డెలివరీ బాయ్స్‌గా స్విగ్గీ, జొమాటో వంటి పేరొందిన సంస్థల్లో గిగ్‌ వర్కర్లగా పనిచేసే వారికి ఈవీ వెహికిళ్లు వరంగా మారనున్నాయి. దీంతో పాటు వ్యవసాయ అవసరాలకు సోలార్‌ కంట్రోల్‌ పంపు యూనిట్స్‌ ఇన్‌స్టాలేషన్‌, మెయింటెనెన్స్‌ రంగంలో ఎస్సీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

పర్యావరణ హితం..

ఆర్థిక భరోసాయే పథకం ఉద్దేశం

పెట్రోల్‌తో పోలిస్తే ఈవీ స్కూటర్లు, ఆటోల మె యింటెనెన్స్‌ చాలా తక్కువ. దీనివల్ల లబ్ధిదారులకు రోజువారీ ఆదాయం మెరుగు పడుతుంది. కాలుష్య రహిత సమాజం కోసం ప్రభుత్వం ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తోంది. సోలార్‌ పంపుసెట్లతో పొలాల్లో వెలుగులు, నిరుద్యోగ యువతకు చేతినిండా పనికల్పించాలనే ఉద్దేశంతో భారీ రాయితీతో కూడిన కంట్రోల్‌ యూనిట్లు అందించి ఆర్థిక భరోసా కల్పించాలని సర్కారు నిర్ణయించింది.

సబ్సిడీతో కూడిన రుణాలు

స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్‌ వర్కర్లతో పాటు టువీలర్‌పై చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి 90 శాతం సబ్సిడీ, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో రూ.లక్ష విలువైన ఈవీ స్కూటర్‌ను అందించనుంది. అలా గే, ఎలక్ట్రిక్‌ ఆటో ప్యా సింజర్‌ గూడ్స్‌ వాహనాల విలువ ఒక్కొక్కటి రూ.3 లక్షలు కాగా 70 శాతం రాయితీ అందించనుంది. మిగతా 30 శాతం లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. సోలార్‌ పంపు కంట్రో ల్‌ యూనిట్‌ ఒక్కొక్కటి రూ.3 లక్ష ల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. యూనిట్‌ విలువను బట్టి రూ.5 లక్షల వరకు రాయితీ ఇస్తుంది. మిగతా సొమ్ము లబ్ధి దారుడు భరించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు

ఈనెల 24వ తేదీ గడువు

అర్హులైన ఆసక్తి గల నిరుద్యోగ యువత నుంచి ఎస్సీ కార్పొరేషన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈనెల 24 వ తేదీ వరకు గడువు ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా టీ జీఓబీఎంఎంఎస్‌.సీజీజీ.జీఓవీ.ఇ న్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాలి. ఫొటోతో కూడిన దరఖాస్తుతో పాటు ఆధార్‌, రేషన్‌కా ర్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ ప త్రాలు జత చేయాల్సి ఉంటుంది. టు, త్రీ వీలర్‌ కోసం శాశ్వత డ్రై వింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. సో లార్‌ పంపు కంట్రోల్‌ యూనిట్‌ కోసం రెండు ఎకరాల భూమి, పట్టదారు పాస్‌బుక్‌, నీటి లభ్యత బో రు ఉన్నట్లు జీపీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. టు, త్రీ వీలర్‌ కోసం 2025 జూలై,1 నాటికి 21 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. సోలార్‌ పంపు యూనిట్ల కోసం 21 నుంచి 60 వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.లక్ష 50వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించి ఆదాయం ఉండొద్దు. బ్యాంకు కాన్సెంట్‌ తప్పని సరి. గడిచిన ఐదేళ్లలో ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం పొందని వారే ఈ పథకాలకు అర్హులు.

ఉమ్మడి జిల్లాకు మంజూరైన యూనిట్లు

జిల్లా జనాభా టువీలర్‌ త్రీవీలర్‌ సోలార్‌

యూనిట్లు

జనగామ 1,19,796 110 54 12

హనుమకొండ 1,96,046 179 90 19

వరంగల్‌ 1,28,568 117 60 12

మహబూబాబాద్‌ 1,04,508 96 48 10

ములుగు 46,473 40 21 05

జేఎస్‌ భూపాలపల్లి 92,017 87 41 09

స్వయం ఉపాధి దిశగా సాగడానికి ప్రభుత్వం తోడ్పాటు

ఎలక్ట్రిక్‌ వాహనాలతో ఆర్థికాభివృద్ధి సాధించడానికి బాటలు

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీతో ఈవీ స్కూటర్లు, ఆటోలు

సోలార్‌ పంపు కంట్రోల్‌ యూనిట్ల పంపిణీకి చర్యలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు 1,010 యూనిట్లు

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement