నేటి నుంచి ఉద్యమకారుల స్మారక వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఉద్యమకారుల స్మారక వారోత్సవాలు

Mar 23 2026 8:54 AM | Updated on Mar 23 2026 8:54 AM

కేయూ క్యాంపస్‌: భారత జాతీయ ఉద్యమకారులైన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా ఈనెల 23నుంచి 30వ తేదీ వరకు స్మారక వారోత్సవాలను విద్యాసంస్థల్లో నిర్వహించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహా రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు కాకతీయ యూ నివర్సిటీ మొదటి గేట్‌ నుంచి రెండో గేట్‌ వరకు ఆదివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ వరంగల్‌, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు బోయినపల్లి అజయ్‌, కేయూ నా యకులు వంశీ, అశోక్‌ నాయక్‌, అనిల్‌, వరుణ్‌, వీరన్న, మాన్‌సింగ్‌, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement