వరంగల్ చౌరస్తా: ఎంజీఎం ఆస్పత్రి రిటైర్ట్ ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీరాం రాజేశ్వర్‌రావు (78) ఆదివారం ఉదయం వరంగల్ గిర్మాజీపేటలోని ఆయన నివాసంలో మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి తర్వాత గుండెనొప్పితో బాధపడుతుండగా ఆస్పత్రికి తరలించిన అనంతరం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ రాజేశ్వర్‌రావు ఎంజీఎంలో ఆర్‌ఎంఓగా పనిచేసిన కాలంలో ప్రశంసలు అందుకున్నారు. అలాగే, పేదలకు వైద్యసేవలు అందించి మంచి పేరు సంపాదించుకున్నారు. రాజేశ్వర్‌రావు మృతికి డీఎస్పీ కిరణ్‌కుమార్, పెద్ద ముప్పారం సర్పంచ్ భరత్, పెరిక సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అచ్చ వినోద్‌కుమార్, హైకోర్టు న్యాయవాది పురుషోత్తమరెడ్డి, వరంగల్ న్యాయవాదులు మల్లికార్జున్, ధనుంజయ, డాక్టర్ పి.సాంబశివరావు, డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ అన్వర్‌పాషా, డాక్టర్ రంజిత్‌కుమార్, డాక్టర్ బందెల మోహన్‌రావు, డాక్టర్ సంగని మల్లేశ్వర్, కీత విజయ్‌కుమార్, శరత్‌కుమార్ సంతాపం తెలిపారు.


