కూసం రాజమౌళి సేవలు ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

కూసం రాజమౌళి సేవలు ఆదర్శం

Mar 23 2026 8:54 AM | Updated on Mar 23 2026 8:54 AM

గీసుకొండ: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి గంగదేవిపల్లి మాజీ సర్పంచ్‌, దివంగత కూసం రాజమౌళి సేవలు ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇటీవల మృతి చెందిన రాజమౌళికి బాలవికాస ఆధ్వర్యంలో ఆది వారం గంగదేవిపల్లిలో సంతాప సభ నిర్వహించా రు. ముందుగా రాజమౌళి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ గంగదేవిపల్లిలోని శిక్షణ కేంద్రానికి కూసం రాజమౌళి పేరు పెడతామని హామీ ఇచ్చా రు. అవసరమైతే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. రాజమౌళి సమాజం కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడని ఆమె ప్రశంసించారు. మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సర్పంచ్‌గా రాజమౌళి, తాను ఎమ్మెల్యేగా నేపాల్‌ వెళ్లానని గుర్తుచేసుకున్నారు. రాజమౌళి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ఉ న్న అన్ని గ్రామ పంచాయతీల గ్రామసభల్లో చర్చించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ రా జమౌళి అపారమైన సామాజిక స్పృహతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఆయన చేపట్టిన అభివృద్ధి నమూనాను 90 దేశాల ప్రతి ని ధులు వచ్చి అధ్యయనం చేయడం గర్వకారణమని గుర్తు చేశారు. బాలవికాస డైరెక్టర్‌ సింగారెడ్డి శౌరెడ్డి మాట్లాడుతూ రాజమౌళి గ్రామానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఇంటిలో ఒక మొక్క నాటాలని అ న్నారు. గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌ కూసం స్వరూప, వీఓఏల సంఘం ప్రతినిధులు మంత్రి సీతక్కకు వినతులు అందచేశారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్‌ ఎండీ రియాజుద్దీన్‌, ఎంపీఓ పాక శ్రీనివాస్‌, ఆర్‌ఐ సాంబయ్య, జీపీఓ జక్కుల రమ, ఎంసీపీఐ స్టేట్‌ కమిటీ మెంబర్‌ గోనె కుమారస్వామి, మాజీ సర్పంచ్‌ గోనె మల్లారెడ్డి, అధికార ప్రతినిధి చాడ కొమురరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌, కూసం లింగయ్య, రాజమౌళి కుటుంబ సభ్యులు లలిత, రమేశ్‌,, ఈశ్వర్‌ పాల్గొన్నారు.

సంతాప సభలో మంత్రి ధనసరి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement