హన్మకొండ : విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ కీలకమని ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ సీఈఓ ఇరుకుళ్ల మునీందర్ అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ‘ఫిజిక్స్ వాలా’ ఆధ్వర్యంలో జేఈఈ, నీట్‌పై విద్యార్థులు, తల్లిదండ్రుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఫర్‌ఫెక్ట్ ఫౌండేషన్ కోచింగ్‌తోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండేళ్ల ఐఐటీ, జేఈఈ కోచింగ్ ఇస్తున్నామన్నారు. ఈ దశలో రెండు సంవత్సరాలు తమ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే అద్భుత ఫలితాలు సాధించొచ్చని చెప్పారు. వివిధ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఐఐటీ, నీట్‌లో లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇస్తామన్నారు. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న విద్యా సంస్థ ‘ఫిజిక్స్ వాలా’ ను హనుమకొండలో ఆఫ్‌లైన్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ రామన్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా విద్యావ్యవస్థలో ఎన్నో వేల మంది సాధారణ విద్యార్థులు ఐఐటీ, నీట్‌లలో ఉత్తమ ర్యాంకులు సాధించేలా ప్రోగ్రాం రూపొందించి అద్భుత ఫలితాలు సాధించామన్నారు. సదస్సులో ‘ఫిజిక్స్ వాలా’ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ సీఈఓ మునీందర్


