కేయూ క్యాంపస్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాకతీయ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ విద్యార్థిని శ్రీవిద్య కుటుంబ సభ్యులను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బానిగండ్లపల్లిలో కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఆదివారం పరామర్శించారు. తొలుత శ్రీవిద్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీవిద్య తల్లి మాట్లాడుతూ తన కుమార్తె మరణానికి కారకులైన వారిపై చర్య తీసుకోవాలని కోరారని కేయూ విద్యార్థి సంఘం నాయకుడు బొట్ల మనోహర్ తెలిపారు. శ్రీవిద్య కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కేయూలోని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు మంద భాస్కర్, కుమ్మరి శ్రీనాథ్, నవీన్, నాగరాజ్, లంక రాజ్‌గోపాల్, మాచర్ల శరత్‌చంద్ర, సోమేశ్, మట్టెడ కుమార్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.


