హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌ నివారణ | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌ నివారణ

Mar 9 2026 7:38 AM | Updated on Mar 9 2026 7:38 AM

డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌

నెహ్రూసెంటర్‌: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ వ్యాధి నివారించవచ్చని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు అన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జీజీహెచ్‌లో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువతులు, బాలికలు వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండవచ్చన్నారు. జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీవీవీపీ కోఆర్డినేటర్‌ చింత రమేశ్‌, ఆర్‌ఎంఓ జగదీశ్వర్‌, డీఐఓ లక్ష్మీనారాయణ, వైద్యులు మౌనిక, మోహన్‌, ఎంపీహెచ్‌ఈఓ కేఎల్‌ఎన్‌ స్వామి, తోట శ్రీనివాసరావు, గోపు రవి, అరుణ్‌, ప్రసాద్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement