మెరిసిన జనగామ డీపీఓ | - | Sakshi
Sakshi News home page

మెరిసిన జనగామ డీపీఓ

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

జనగామ: జనగామ జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న అంగరాజు నవీన్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో 715వ ర్యాంక్‌ సాధించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లకు చెందిన సైదులు– లింగమ్మ కుమారుడు నవీన్‌ వరంగల్‌లోని కేఎంసీలో తన వైద్య విద్యను 2021లో పూర్తి చేశారు. అనంతరం నల్గొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యంగా కృషి చేసిన ఆయన నాల్గో ప్రయత్నంలో 715వ ర్యాంకు సాధించారు. గతంలో గ్రూప్‌–1లో ఉత్తమ ర్యాంకు సాధించి ప్రస్తుతం డీపీఓగా విధులు నిర్వర్తిస్తూనే సివిల్స్‌కు ప్రయత్నించి విజయం సాధించారు. ఇదే పట్టుదలతో ఐఏఎస్‌ దిశగా ప్రిపరేషన్‌ కొనసాగిస్తానంటున్నారు.. నవీన్‌.

Advertisement
 
Advertisement
Advertisement