ఖైదీలకు డీఎల్‌ఎస్‌ఏ న్యాయ సహాయం | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు డీఎల్‌ఎస్‌ఏ న్యాయ సహాయం

Mar 1 2026 8:04 AM | Updated on Mar 1 2026 8:04 AM

ఖైదీల

ఖైదీలకు డీఎల్‌ఎస్‌ఏ న్యాయ సహాయం

మహబూబాబాద్‌ రూరల్‌ : న్యాయవాదులను నియమించుకోలేని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయ సహాయం అందిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి శాలిని షాకెల్లి అన్నారు. మహబూబాబాద్‌ సబ్‌ జైలును శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందించే ఆహారం, తాగునీరు, వంటశాల, బ్యారక్‌, పరిశుభ్రతను తనిఖీ చేశారు. విచారణలో ఉన్న ఖైదీలకు న్యాయ సహాయం అందుతుందా లేదా అని పరిశీలించారు. ప్రైవేట్‌ న్యాయవాదులను నియమించుకోలేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదులను కేటాయిస్తారని తెలిపారు. జైలులో ఉన్న లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సబ్‌ జైలు సూపరిండెంటెంట్‌ మల్లెల శ్రీనివాసరావు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

ముగిసిన సీసీఐ పత్తి కొనుగోళ్లు

మహబూబాబాద్‌ రూరల్‌: కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో జిల్లాలోని తొమ్మిది పత్తి మిల్లుల్లో నిర్వహించిన పత్తి కొనుగోళ్లు శనివారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 20,968 మంది రైతుల వద్ద నుంచి 2,92,579.55 క్వింటాళ్ల పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేశారు.

ఏకలవ్యలో తహసీల్దార్‌ విచారణ

కురవి: మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో శనివారం తహసీ ల్దార్‌ విజయ విచారణ చేపట్టారు. తహసీల్దార్‌ తన సిబ్బందితో కలిసి కళాశాలకు వెళ్లి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం సంఘటనపై ప్రిన్సి పాల్‌తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను కోరగా ఇద్దరు విద్యార్థినులు కలిసిమెలసి ఉన్నారని, లెటర్స్‌, డైరీలు రాసుకున్నట్లు ప్రిన్సిపాల్‌ చూపించి నట్లు తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని తమ తల్లిదండ్రుల వద్ద ఉందని, మరో విద్యార్థినికి పరీక్షలు ఉండడంతో ఆమె ను విచారించలేదని తహసీల్దార్‌ తెలిపారు.

బారికేడుకు మరమ్మతు

డోర్నకల్‌: మండలంలోని ములకలపల్లి శివారు ఆకేరువాగు కాజ్‌వే దుస్థితిపై సాక్షి దినపత్రికలో ‘మరమ్మతులేవి?’ శీర్షికన ప్రచురితమైన కథనంపై హైవే అధికారులు శనివారం స్పందించారు. విరిగి ప్రమాదకరంగా ఉన్న ఐరన్‌ రిస్ట్రిక్షన్‌ బారికేడుకు మరమ్మతులు చేశారు. చెక్కలను తొలగించి దృఢంగా ఉండేలా వెల్డింగ్‌ చేశారు.

సౌత్‌జోన్‌ టోర్నమెంట్‌కు కేయూ జట్టు

కేయూ క్యాంపస్‌: తమిళనాడులోని తిరుచారపల్లిలోని భారతీదాస్‌ యూనివర్సిటీలో మార్చి 2, 3 తేదీల్లో నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ చెస్‌ టోర్నమెంట్‌లో కేయూ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు శని వారం కేయూ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ వై.వెంకయ్య తెలిపారు. ఈజట్టులో పి.శ్రీచైతన్య (డీఆర్‌ఎస్‌ డిగ్రీ కాలేజీ, ఖమ్మం), ఎస్‌.శివసాత్విక్‌ (యూసీఈటీ, కేయూ), ఎస్‌.సంజయ్‌చంద్ర, బి.రాకేశ్‌ (వరంగల్‌ కిట్స్‌), కె.సచిన్‌ (యూసీపీఈ, ఖమ్మం), జె.శివకుమార్‌ (మాస్టర్జీ డిగ్రీ కళాశాల, హనుమకొండ), ఈజట్టుకు హనుమకొండలోని మాస్టర్జీ డిగ్రీ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ కె.నరేందర్‌ కోచ్‌ కమ్‌ మేనేజర్‌గా వ్యవహరించనున్నట్లు వెంకయ్య తెలిపారు.

ఖైదీలకు డీఎల్‌ఎస్‌ఏ న్యాయ సహాయం1
1/2

ఖైదీలకు డీఎల్‌ఎస్‌ఏ న్యాయ సహాయం

ఖైదీలకు డీఎల్‌ఎస్‌ఏ న్యాయ సహాయం2
2/2

ఖైదీలకు డీఎల్‌ఎస్‌ఏ న్యాయ సహాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement