ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
● అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్
మహబూబాబాద్ అర్బన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు టీజీపీఎస్‌సీ బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, వివిధ పోటీ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలలు ఉచిత శిక్షణ నిర్వహిస్తుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత శిక్షణ కరపత్రాలను అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 20 నుంచి జూలై 19వ తేదీ వరకు వరంగల్ జిల్లాలో నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణను ఇవ్వనున్నారని, అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.3లక్షల లోపు ఉండాలని, ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌స్టడీ సర్కిల్. కామ్.ఇన్ వెబ్‌సైట్‌లో నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 2న నిర్వహిస్తారని, పూర్తి వివరాలకు 040–23546552, 8121626423, 9542834507 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, బీసీ సంక్షేమశాఖ అధికారి శ్రీనివాస్, ఉద్యోగులు పూర్ణ పాల్గొన్నారు.


