కాలినడకన..
కురవి: సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో ప్రాథమిక, జెడ్పీ హైస్కూల్స్ ఉన్నాయి. ఈ రెండు పాఠశాలలకు గ్రామంతోపాటు చుట్టు పక్కల ఉన్న భూక్య తండా, బోడతండా నుంచి విద్యార్థులు వస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు భూక్యతండా నుంచి ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో గురువారం కొందరు విద్యార్థులు కాలినడకన వచ్చి వెళ్లారు. విద్యార్థులకు సైకిళ్లు, ఇతర ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కాళ్లకు పనిచెప్పి స్కూల్‌కు వస్తున్నారు. తండాకు వెళ్లేందుకు ఆటోలు, ఇతర వాహనాలు లేవు. దీంతో బడికి రావాలంటే కాలినడకే శరణ్యంగా మారింది. ఎవరైనా దాతలు సైకిళ్లు అందిస్తే ఇబ్బందులు పడకుండా బడికి వచ్చే అవకాశం ఉంది.


