రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు ప్రారంభం
డోర్నకల్: స్థానిక చర్చి కాంపౌండ్ గ్రౌండ్‌లో గురువారం ఎస్‌జీఎఫ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవల్ అండర్–19 బాలబాలికల రగ్బీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి పది జిల్లాల బాలబాలికల జట్లు పాల్గొంటున్న రగ్బీ పోటీలు మూడురోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు పోటీలను తొడేళ్లగూడెం శివారులోని ఎన్‌కే ఆగ్రోస్ పరిశ్రమ పీఆర్వో శివప్రసాద్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో జాతీయస్థాయిలో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. మొదటి రోజు వివిధ జిల్లాల జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. కార్యక్రమంలో టోర్నమెంట్ అబ్జర్వర్ బీసన్న, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెంపటి సీతారాములు, తలారి విద్యాసాగర్, టోర్నమెంట్ ఆర్గనైజర్లు రవికుమార్, విజయచందర్, సలవాది మోజేస్‌మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


