వరంగల్ డీసీసీబీని ప్రగతి పథంలో తీసుకెళ్లాలి
● డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జ్,
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ: వరంగల్ డీసీసీబీని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ఆ బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జ్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంబంధిత అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు నిర్వహణ తీరును సమీక్షించి డిపా జిట్లు, రుణాల రికవరీ అంశాలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పనితీరు మెరుగుపరుచుకుంటూ సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఖాతాదారులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హనుమకొండ, జనగామ, జేఎస్ భూపాలపల్లి, వరంగల్ డీసీఓలు సంజీవ రెడ్డి, కోదండరాం, వాలునాయక్, నీరజ, డీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వజీర్ సుల్తాన్, డీజీఎం అశోక్, తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ
హసన్‌పర్తి: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ మహిళలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు, తెల్లరేషన్‌కార్డులు కలిగి ఉన్న వారు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, రేషన్, ఆధార్ కార్డులు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లతో 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. వివరాలకు 9704056522 నంబర్‌లో సంప్రదించాలని రవి సూచించారు


