శాసీ్త్రయ దృక్పథం కోసం పోరాడాలి
వరంగల్: శాసీ్త్రయ దృక్పథం కోసం విద్యార్థులు పోరాడాలని జేఎన్‌యూ ప్రొఫెసర్ వికాస్ వాజ్‌పాయ్ అన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల్లో భాగంగా వరంగల్ పోచమ్మమైదాన్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ప్రతినిధుల సభ నిర్వ హించారు. సభ ప్రారంభానికి ముందు పీడీఎస్‌యూ జెండాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్ ఆవిష్కరించగా ఆహ్వాన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ ప్రారంభో పాన్యాసం చేశారు. అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమైంది. సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు అమరవీర సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వికాస్ వాజ్‌పాయ్ మాట్లాడుతూ ప్రగతిశీల ఉద్యమాలకు ఆద్యం పొసిన విప్లవ విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ అని కొనియాడారు. అనంతరం పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకురా లు దీపాలక్ష్మి అధ్యక్షతన ‘నూతన జాతీయ వి ద్యా విధానం–కర్తవ్యం’ అనే అంశంపై హెచ్‌సీయూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ విద్య అందరి ద్రాక్షలా మార్చడానికి ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు పి.మహేశ్, జేఎన్‌యూ నాయకుడు సౌరవ్, ఢిల్లీ నాయకుడు రోహిత్, తమిళనాడు ఆర్‌ఎస్‌వైఎఫ్ బా లరాజు, పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్ నేత ధీరజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె . భాస్కర్.ఎం.వినోద్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి మధు, జన్నారాపు రాజేశ్వర, డి.శ్రీకాంత్, ఎం.నవీన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
జేఎన్‌యూ ప్రొఫెసర్ వికాస్ వాజ్‌పాయ్


