జాతరకు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం
వేగంగా గద్దెల పునరుద్ధరణ పనులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం గద్దెల చుట్టూ ఉన్న పాత గ్రిల్స్ తొలగించారు. అనంతరం గద్దెలపై సీసీ ఫ్లోర్లింగ్ చేపట్టారు. ఈ పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షించారు. కాగా, గద్దెల పునరుద్ధరణ పనుల సందర్భంగా భక్తులను తల్లుల దర్శనాలకు అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. బయటి నుంచే దర్శించుకునేలా ఏర్పాటు చేశారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర మంత్రి సీతక్క.. ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. మంగళవారం ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి దామోదర రాజనర్సింహ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు రాజకీయ పార్టీల నేతలను జాతరకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.
మంత్రి దామోదర రాజనర్సింహకు జాతర ఆహ్వాన పత్రిక అందజేస్తున్న మంత్రి సీతక్క
జాతరకు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం


