కంపెనీ బ్రాండ్లు మార్చేది మార్వాడీ వ్యాపారులే!
● స్థానిక వ్యాపార సంస్థలపై ఆరోపణలు సరికాదు
● వరంగల్ బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు
నమఃశివాయ
వరంగల్ చౌరస్తా : వరంగల్‌లోని మార్వాడీ వ్యాపారులు ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో నకిలీ వస్త్రాలు అమ్ముతున్నారని వరంగల్ బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు నమఃశివాయ తెలిపారు. ఈ మేరకు సోమవారం వరంగల్ బట్టల బజారు వర్తక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాండెడ్ కంపెనీల పేరిట స్థానిక మార్వాడీ వ్యాపారులు దుస్తులపై నకిలీ స్టిక్కర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. 60 సంవత్సరాల నుంచి వరంగల్ వర్తక, వ్యాపారులం నిజాయితీతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వాలకు అన్నీ రకాల పన్నులు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. నకిలీ స్టిక్లర్లు వేసి బ్రాండ్ల పేరుతో అమ్మకాలు చేస్తున్న మార్వాడీ వస్త్ర వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్యదర్శి కోమాండ్ల ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి అల్లాడి వీర ప్రసాద్ తదితరులు ఉన్నారు.


