భక్తుల రాకపోకలకు అంతరాయం ఉండొద్దు
ములుగు రూరల్: ‘ఇప్పుడే ఇలా ... మహా జాతరకెలా’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం ఎస్పీ సుధీర్ ఆర్. కేకన్, జాతీయ రహదారుల శాఖ డీఆర్ కిరణ్ కుమార్ మల్లంపల్లి కెనాల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈ చేతన్, సీఐ సురేశ్‌కుమార్, ట్రైనీ ఎస్సై చంద్రశేఖర్ పాల్గొన్నారు.
బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన
పూర్తి చేయాలి
ఎస్పీ సుధీర్ ఆర్. కేకన్, జాతీయ
రహదారుల శాఖ డీఆర్ కిరణ్ కుమార్
భక్తుల రాకపోకలకు అంతరాయం ఉండొద్దు


