‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదవుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని గిరిజన సంక్షేమ శాఖ ఏసీఎంఓ రాములునాయక్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఏసీఎంఓ రాములు నాయక్ పదో తరగతి పరీక్షలు, ఫలితాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది మాదిరిగానే ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేసుకొని, 60రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులను సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయులు దత్తత తీసుకొని మెరుగుపర్చాలని సూచించారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


