అండగా ‘అమ్మ ఒడి’
● జిల్లాలో ఏడు అమ్మ ఒడి
అంబులెన్స్‌ల సేవలు
● గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా
నెహ్రూసెంటర్: గర్భిణులు సకాలంలో మెరుగైన వైద్యసేవలతో పాటు తగు జాగ్రత్తలు పాటిస్తేనే కాన్పు ప్రశాంతంగా జరుగుతుంది. అయితే గ్రా మీణ ప్రాంతాల గర్భిణులు, బాలింతలు పట్టణాల్లో ఆస్పత్రులకు వచ్చేందుకు రవాణాపరమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇది గమనించిన ప్రభుత్వం.. గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు చేరవేర్చడం, బాలింతలను ఇంటికి తీసుకెళ్లేందుకు 102–అమ్మ ఒడి అంబులెన్స్‌లు ఉపయుక్తంగా మారాయి. ప్రైవేట్ వాహనాల ద్వారా వ్యయప్రయాసాలు పడకుండా అంబులెన్స్‌ల ద్వారా సురక్షిత ప్రయాణాలు సాగిస్తున్నారు. కాగా, జిల్లాలో ఏడు అమ్మ ఒడి వాహనాలు గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందిస్తున్నాయి.
నెలనెలా..
గర్భందాల్చిన నాటి నుంచి ప్రసవించే వరకు, ప్రసవించిన తర్వాత బాలింతలను ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి వైద్య పరీక్షలు పూర్తయ్యాక 102 అంబులెన్స్ ద్వారా సిబ్బంది చేరవేస్తున్నారు. నెలనెలా ఆస్పత్రికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలకు అన్ని వేళల్లో 102 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటున్నాయి.
జిల్లాలో ఏడు అంబులెన్స్‌లు..
జిల్లాలో ప్రస్తుతం ఏడు 102అమ్మ ఒడి అంబులెన్స్‌లు గర్బిణులు, బాలింతలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు, తండాలు, గూడేలు అధికంగా ఉండడంతో మరికొన్ని అంబులెన్స్‌లను సమకూర్చడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయని ప్రజలు కోరుతున్నారు. ఇప్ప టి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా షెడ్యూల్ ప్రకారం గ్రామాలు, పల్లెలకు అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
ఉచితంగా రవాణా సౌకర్యం
గర్భిణులు, బాలింతలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, ప్రసవం కోసం వెళ్లేందుకు అమ్మ ఒడి అంబులెన్స్ ద్వారా రవాణా సౌకర్యం ఉంది. సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం, మెరుగైన వైద్యం అందుతుంది. ప్రతీ నెల ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా 102 సిబ్బంది చేరవేస్తారు.
– షేక్ నజీరుద్దీన్, ప్రోగ్రాం మేనేజర్
నెల గర్భిణులు,
బాలింతలు
జూన్ (2025) 2,137
జూలై 2,120
ఆగస్టు 2,195
సెప్టెంబర్ 1,941
అక్టోబర్ 2,215
నవంబర్ 2,152
డిసెంబర్ 2,134
అండగా ‘అమ్మ ఒడి’


