పొగమంచు అనుకుంటే పొరపాటే..
జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు రోడ్డు వెడల్పు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో కంకర తేలి, రోడ్డు గుంతలమయంగా మారి వాహనాలు వెళ్తున్నప్పుడు దుమ్ము లేస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వెంట ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు దుమ్ముతో ఊపిరాడక అవస్థలు పడుతున్నారు. కాగా, రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి దుమ్ము సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
– సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్
పొగమంచు అనుకుంటే పొరపాటే..


