సైకిళ్లపై వెంకన్న దర్శనానికి..
చిల్పూరు: హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు సైకిళ్లపై వచ్చి ఆదివారం చిల్పూరులోని బుగులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వారితో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. అధికారులు జానకీరాం, కిశోర్, శ్రీనివాస్‌రెడ్డి, హరి, దీపక్, మణికంఠ, అశోక్, సురేశ్ ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
మరిపెడ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హాన్‌పురం గ్రామ శివారు సూర్యాపేట–మహబూబాబాద్ 365 జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండం బచ్చోడు గ్రామ శివారు బచ్చోడు తండాకు చెందిన ధరావత్ రవీందర్ (30) పని నిమిత్తం తన బైక్‌పై మరిపెడ మండల కేంద్రానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బుర్హాన్‌పురం గ్రామ శివారు మలుపు వద్ద బైక్ అదుపు తప్పి సిగ్నల్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నేటినుంచి పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు
విద్యారణ్యపురి: పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభలు ఈనెల 5, 6, 7 తేదీల్లో నిర్విహించనున్నారు. ఈనెల 5న ఉదయం 11 గంటలకు ఏకశిల పార్కు నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్‌లో జరగనున్న బహిరంగ సభ ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, పీడీఎస్‌యూ ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.ప్రసాద్, సాధినేని వెంకటేశ్వర్‌రావు, ఎం శ్రీనివాస్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య, పీడీఎస్‌యూ జాతీయ నాయకులు పి.మహేశ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు, ఐఎఫ్‌టీయూ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేశ్ ప్రసంగిస్తారు. అదేవిధంగా రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఈనెల 6,7 తేదీల్లో వరంగల్ అబ్నూస్ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థి ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు.
● బుర్హాన్‌పురం శివారు హైవేపై ఘటన
● మృతుడు ఖమ్మం జిల్లా వాసి


