కొడుకు పుట్టాడని..!
గీసుకొండ: కొడుకు పుట్టాడని ఓ కుటుంబం కాషాయ జెండాలను పట్టుకుని కాలినడకన వెళ్తోంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వరంగల్–నర్సంపేట రోడ్డులో నర్సంపేట వైపు వెళ్తున్న మహారాష్ట్రవాసులు ఆదివారం మధ్యాహ్నం ‘సాక్షి’కి తారసపడ్డారు. వారిని చూసి పలకరించగా తమ కుటుంబంలో సంతానం లేక దిగులు చెంది భద్రాద్రి రాముడికి మొక్కుకున్నామని, ఆ దేవుడు కరుణించడంతో కుమారుడు జన్మించారని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల కుమారుడితో రాముల వారిని దర్శించి కృతజ్ఞత తెలుపడానికి కాలినడకన వెళ్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలాదూరం నడిచి వచ్చామని, మరో 150 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉందని తెలిపారు. మార్గమధ్యలో పలువురు తోచిన రీతిలో ప్రయాణ ఖర్చులకు నగదు సాయం చేశారు.
మహారాష్ట్ర నుంచి భద్రాద్రి రాముడి సన్నిధికి
కాలినడకన వెళ్తున్న కుటుంబం


