పుస్తకంలోనే అమూల్యమైన అంశాలు
హన్మకొండ కల్చరల్: పుస్తకం చదవడం వల్ల అమూల్యమైన అంశాలను తెలుసుకోవచ్చని, పుస్తకం భక్తి కావ్యాలు, నైతిక విలువలు నేర్పుతుందని కేయూ విశ్రాంతాచార్యుడు కొక్కొండ విజయబాబ అన్నారు. కాకతీయ పద్యకవితా వేదిక వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ భద్రకాళిరోడ్‌లోని శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ధ్యానమండపంలో హనుమకొండకు చెందిన విశ్రాంత భాషోపాధ్యాయుడు నర్సింగోజు లక్ష్మ య్య రచించిన ‘బ్రహ్మం గారి పద్య శతకం’ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. కొక్కొండ విజయబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం కమిటీ సలహాదారు కొక్కొండ శంకరయ్య పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీడికంటి శ్రీనివాసమూర్తి పుస్తకసమీక్ష చేయగా అక్కెర కరుణాసాగర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మారెడోజు సదానందాచారి, ఎర్రోజు లక్ష్మణాచారి, డా క్ట ర్ పల్లేరు వీరస్వామి, చేపూరి శ్రీరాం, వేదిక సభ్యులు వెలుగు ప్రభాకర్, పాము భాస్కర్, సిద్దెంకి బాబు, బొల్లోజు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
కేయూ విశ్రాంతాచార్యుడు విజయబాబు


