సౌకర్యాలు లేవు..
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సౌకర్యాలు లేక చదువుకోలేపోతున్నాం. విద్యార్థులకు అవసరమైన బిల్డింగ్, ల్యాబ్, హాస్టల్ సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వం, అధికారులు సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
– జ్ఞానత్రిష, నర్సింగ్ విద్యార్థి
అధికారుల దృష్టికి తీసుకెళ్లా..
నర్సింగ్ కళాశాలలో నాలుగు బ్యాచ్‌లకు చెందిన 240 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సౌకర్యాలు, బిల్డింగ్, ల్యాబ్, తరగతి గదులకు సంబంధించిన విషయాలను అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా. అధికారులు చెప్పిన బిల్డింగ్ ఖాళీ చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
– లీలా, కళాశాల ప్రిన్సిపాల్


