లూయిస్ బ్రెయిలీ జయంతి
మహబూబాబాద్: మహిళా శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు ప్రధానంగా అంధులు ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. కొంత మంది అంధులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబిత, జూనియర్ అసిస్టెంట్ హరీశ్, అంధులు పాల్గొన్నారు.
సీఐటీయూ జాతీయ
కార్యదర్శిగా భాస్కర్
గార్ల: గార్లకు చెందిన పాలడుగు భాస్కర్ సెంట్రల్ ఇండియా ట్రేడ్ యూని యన్ (సీఐటీయూ) జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విశాఖపట్నంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభల్లో ప్రస్తుతం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న భాస్కర్‌ను ఆదివారం జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కుల సాధన కోసం, కార్మికుల వేతనాల పెంపుకోసం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోరాటాల్లో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం
నర్సింహులపేట: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున జిల్లాలోని నర్సింహులపేట మండల పరిధి జయపురం గ్రామానికి చెందిన క్రిడాకారిణి చందు లావణ్య ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరించడంపై గ్రామస్తులు, వంగాల చారిటబుల్ ట్రస్ట్, క్రీడాకారులు, బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎంను కలిసిన సీఎండీ వరుణ్‌రెడ్డి
హన్మకొండ: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను శనివారం రాత్రి హైదరాబాద్‌లో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, మధుసూదన్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శుభా కాంక్షలు తెలిపారు.
లూయిస్ బ్రెయిలీ జయంతి
లూయిస్ బ్రెయిలీ జయంతి


