గ్రామాల్లోనే యూరియా పంపిణీ
మరిపెడ రూరల్: ఇక నుంచి గ్రామాల్లోనే కౌంటర్ల ఏర్పాటు చేసిన దశల వారీగా రైతులకు యూరియా పంపిణీ చేయనున్నట్లు డీఏఓ బి. సరిత అన్నారు. ఆదివారం మరిపెడ మండల కేంద్రంలో పలు సెంటర్లలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఏఓ వీరసింగ్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ రైతులకు సరిపడా యూరియా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పంపిణీ చేస్తున్న యూరి యాను రైతులు దశల వారీగా ఉపయోంచుకోవా లని ఆమె సూచించారు. అదేవిధంగా నానో యూ రియా వాడకంపై కూడా రైతులకు అవగాహన కల్పి ంచారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
ఆందోళన అవసరం లేదు..
నర్సింహులపేట: యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ రైతుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని డీఏఓ బి.సరిత అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో రైతులకు యూరియా కూపన్ల పంపిణీ, యూరియా పంపిణీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. యాసంగి సీజన్‌లో ప్రతీ రైతుకు సరిపడా యూరియా ఉందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ వినయ్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


