బిల్డింగ్ సరిపోవడం లేదు..
నర్సింగ్ కళాశాలకు సంబంధించిన బిల్డింగ్ సరిపోవడం లేదు. ల్యాబ్, తరగతులకు ఇబ్బంది అవుతుంది. రెండు గదులు మాత్రమే ఉన్నాయి. నాల్గో బ్యాచ్ కూడా కళాశాలలో చేరడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ బిల్డింగ్, ఇతర సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదు.
– కె.డింపుల్, నర్సింగ్ విద్యార్థి
బయట హాస్టల్‌లో ఉంటున్నాం..
మాకు సరిపడా తరగతి గదులు, హాస్టల్ బిల్డింగ్ లేదు. బయట హాస్టల్‌లో ఉంటున్నాం. కిరాయి డబ్బులు మేమే చెల్లించుకుంటున్నాం. పరీక్షలు దగ్గర పడుతున్నాయి.. సౌకర్యాలు లేకపోతే ఎలా చదువుకోవాలి. అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సౌకర్యాలు కల్పించాలి.
– శ్రీవల్లి, నర్సింగ్ విద్యార్థి
బిల్డింగ్ సరిపోవడం లేదు..


