ప్రమాదాల నివారణకు కీలక అడుగు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర సందర్భంగా భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా విద్యుత్ శాఖ అధికారుల కీలక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మేడారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అటవీశాఖ బీట్ కార్యాలయం నుంచి తాడ్వాయి వెళ్లే దారిలో గట్టమ్మ వరకు మూడు కిలోమీటర్ల మేర 33/11 కేవీ విద్యుత్ లైన్‌కు ఏర్పాటు చేస్తున్న కవర్ కండక్టర్ల పనులు కొనసాగుతున్నాయి. జనసాంద్రత అధికంగా ఉండే ఈ ప్రాంతంలో సాధారణ కండక్టర్లకు బదులు కవర్ కండక్టర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కవర్ కండక్టర్ల ఏర్పాటు వల్ల చెట్లు విరిగిపడినా, కొమ్మలు తాగినా విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ట్రిప్పింగ్ లాంటి సమస్యలు తగ్గుతాయని వివరించారు. ప్రత్యేకంగా మేడారం జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగించే దృష్ట్యా ఈ ఏర్పాట్లు ఎంతో అవసరమన్నారు. వర్షాకాలంలోనూ విద్యుత్ అంతరాయం లేకుండా కవర్ కండక్టర్ ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని తెలిపారు.
33/11 కేవీ విద్యుత్ లైన్‌కు
కవర్ కండక్టర్ల ఏర్పాటు


