హుండీల ఏర్పాటు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులు శనివారం 60 హుండీలు ఏర్పాటు చేశారు. ఈఓ వీరస్వామి సమక్షంలో సమ్మక్క, సారలమ్మ ఒక్కొ గద్దైపె 25, గోవిందరాజు, పగిడిద్దరాజు ఒక్కొ గద్దైపె 5 హుండీలు ఏర్పాటు చేశారు. పూజారుల సమక్షంలో హుండీల తాళాలకు సీల్ వేశారు. భక్తులు కానుకలు వేసేందుకు హుండీలు ఏర్పాటు చేశామని ఈఓ వీరస్వామి తెలిపారు. తహసీల్దార్ సురేశ్‌బాబు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లు, పూజారులు పాల్గొన్నారు.


