పూజల పేరిట రూ. 55 లక్షలు దోపిడీ
రూ.50 వేలు తీసుకుని పరారీ
ధర్మసాగర్: పూజల పేరిట ఓ పూజారి రూ.55 లక్షలు తీసుకుని ఉడాయించాడు. ఈ ఘటన ఇటీవల హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో చోటు చేసుకో గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజలు చేస్తే డబ్బులు మూడింతలు అవుతాయని తనకు తెలిసి న ఓ వ్యక్తి చెప్పగా సదరు ఫామ్ హౌస్ యజమాని నమ్మాడు. దీంతో డిసెంబర్ 30న తన ఫామ్ హౌస్‌లో పూజలు చేయించాడు. ఈ క్రమంలో పూ జారి పూజలు చేస్తూ యజమానిని నమ్మించాడు. రూ.55 లక్షల నగదుకు కూడా పూజ చేస్తానని చెప్పి ఆ యజమానిని ఓ గదిలోకి పంపించి బెడం పెట్టా డు. ఈ క్రమంలో అర్ధగంట దాటినా బెడం తీయలేదు. పూజారి మాటలు కూడా వినపడ లేదు. కిటికీ నుంచి బయటకు వచ్చి చూడగా ఆ పూజారి కనిపించలేదు. దీంతో సదరు పూజారి డబ్బుతో ఉడాయించినట్లు తెలుసుకున్నారు. తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.
బంధువుగా పరిచయం చేసుకున్నాడు..
జనగామ: జనగామ మండలం యశ్వంతపూర్‌కు చెందిన మారబోయిన రాములు డబ్బులు డ్రా చేసుకునేందుకు శనివారం పట్టణంలోని నెహ్రూ పార్క్ సమీపం ఎస్‌బీఐకి వెళ్లాడు. ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా చేసుకున్న అనంతరం బయటకొచ్చాడు. ఈ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడిని అడ్డగించి, తన బంధువునని పరిచయం చేసుకున్నాడు. అనంతరం టిఫిన్ చేద్దామని సమీపంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ చేతులు కడుక్కోవాలని చెప్పడంతో రాములు హ్యాండ్‌వాష్ వద్దకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటన పై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
వరంగల్: గుర్తుతెలియని లారీ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం కొత్తపేట క్రాస్ రోడ్ ఎన్‌ఎస్‌ఆర్ ఆస్పత్రి ఎదుట జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆరెపల్లికి చెందిన గౌని అనిల్‌గౌడ్(50), తన మిత్రుడు సతీశ్.. బైక్‌పై కొత్తపేట నుంచి ఆరెపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌ఆర్ ఆస్పత్రి ఎదుట ములుగు నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని లారీ.. వెనుక నుంచి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు రోడ్డుపై పడిపోగా లారీ అనిల్ తలపై నుంచి వెళ్లడంతో ముఖం చిధ్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. సతీశ్ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే ఎదుట ఉన్న ఎన్‌ఎస్‌ఆర్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆరెపల్లి గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎన్‌ఎస్‌ఆర్ ఆస్పత్రి వద్ద రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన క్రాసింగ్‌తోనే ఈప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. పలుమార్లు ఎన్‌హెచ్ అధికారులకు చెప్పినా రెండు ఆస్పత్రుల నిర్వాహకుల ఒత్తిళ్లతోనే పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఏనుమాముల ఎస్సై రాజు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం లారీని గుర్తించేందుకు ఆస్పత్రికి చెందిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సురేశ్ తెలిపారు.
● ఉనికిచర్లలో ఆలస్యంగా వెలుగు
చూసిన ఘటన
జనగామలో ఘటన
మరొకరికి తీవ్ర గాయాలు
కొత్తపేట క్రాస్‌రోడ్‌లో ఘటన
పూజల పేరిట రూ. 55 లక్షలు దోపిడీ


