ఈస్ట్‌జోన్ క్రికెట్ గోల్డ్ కప్ విన్నర్‌గా హనుమకొండ
కేయూ క్యాంపస్ : తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. విన్నర్‌గా హనుమకొండ, రన్నరప్‌గా ఖమ్మం జట్లు నిలిచాయి. ఫైనల్‌లో హనుమకొండ, ఖమ్మం జట్లు తలపడగా నిర్ణీత 20 ఓవర్లలో హనుమకొండ మూడువికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఖమ్మం 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో 21 పరుగుల తేడాతో హనుమకొండ గెలు పొంది చాంపియన్‌గా నిలిచింది. విన్నర్, రన్నరప్ జట్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బాధ్యుడు, బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర జనరల్‌సెక్రటరీ గురువారెడ్డి, కేయూ మాజీ పీడీ ఎన్‌ఏ జయచందర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పెసరు విజయచందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్లపల్లి జయపాల్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ అలీముద్దీన్ బహుమతులు ప్రదానం చేశారు. కాగా, ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా, మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌గా హనుమకొండకు చెందిన విష్ణుదాస్ శశాంక్, ఉత్తమ బౌలర్‌గా పెద్దపల్లికి చెందిన రాహుల్ ఎంపికయ్యారు.
రన్నరప్‌గా ఖమ్మం జట్టు విజేతలకు ట్రోఫీల ప్రదానం
ఈస్ట్‌జోన్ క్రికెట్ గోల్డ్ కప్ విన్నర్‌గా హనుమకొండ


