ఉత్సవం.. ఉత్సాహం
గంధం ఊరేగింపునకు భారీ బందోబస్తు
రేపటి నుంచి అన్నారం దర్గా ఉర్సు
● మూడు రోజులపాటు నిర్వహణ
● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
● తరలిరానున్న వేలాది మంది భక్తులు
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో యాకుబ్‌షావళి దర్గా ఉర్సు ఈనెల 5వ తేదీ నుంచి జరగనుంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలొచ్చి యాకుబ్‌షావళి దర్గా దర్శించుకోనున్నారు. మొదటి రోజు (సోమవారం) రాత్రి ఖవ్వాలి గేయాలాపన, గంధం ఊరేగింపు, రెండో రోజు (మంగళవారం) దీపారాధన, భక్తుల కు మహా అన్నదానం, మూడో రోజు (బుధవారం) ఖత్‌మల్ ఖురానాలతో ఉత్సవాలు ముగుస్తాయి. ముస్లింలతో పాటు హిందువులు మొక్కులు చెల్లించుకుంటారు. కోళ్లు, యాటలతో కందూర్లు చేస్తారు.
అన్నారం షరీఫ్ గంధం ఊరేగింపు కోసం భారీ పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేశాం. మామునూరు ఏసీపీతోపాటు ఐదుగురు ఎస్సైలు, వంద మంది సిబ్బంది పాల్గొంటారు. ఉర్సు విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
రాజగోపాల్, సీఐ, పర్వతగిరి
ఉత్సవం.. ఉత్సాహం


