మహిళా విద్యతోనే సాఽధికారత
కేయూ క్యాంపస్: నాటి పరిస్థితుల్లో మహిళా విద్యతోనే సాధికారత సాధ్యమని సావిత్రిబాయి పూలే గుర్తించారని, సమాజ నిర్మాణంలో మహిళల కృషి అభినందనీయమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం కేయూలోని సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ అండ్ ఎంపవర్‌మెంట్ డైరెక్టర్ బి. దీపాజ్యోతి అధ్యక్షతన సెనేట్ హాల్‌లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేయూ మహిళా ఉద్యోగులు తమ సంపూర్ణ శక్తి, సామర్థ్యాలను విశ్వవిద్యాలయం అభివృద్ధికి వినియోగిస్తున్నారని కొనియాడారు. సావిత్రిబాయిపూలే గొప్ప సామాజిక సంస్కర్త అన్నారు. అనంతరం వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ మహిళలు మానసికంగా, భావోద్వేగపరంగా బలమైనవారన్నారు. నేటి తరం పురుషులు మహిళలకు సహకరిస్తుండడం అభినందనీయమన్నారు. మైత్రీ, గార్లి వంటి మహనీయ మహిళలను అందించిన దేశం భారతదేశమన్నారు. అదే కోవకు చెందిన మహిళా మూర్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. వివక్ష, అణిచివేత ఉన్నకాలంలో మహిళా విద్యతో చైతన్య నింపిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయిపూలే అని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం యూనివర్సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ కె. మమత, బీసీ సెల్ డైరెక్టర్ బొడిగ సతీష్, కేయూ పాలకమండలి సభ్యురాలు బి. రమ, బి.సుకుమారి మాట్లాడారు.
వర్సిటీ అభివృద్ధిలో
మహిళాఉద్యోగులు కీలకం
కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి


