గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే
హన్మకొండ: గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ముందుగా సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ మహిళా విద్య కోసం సావిత్రిబాయి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి బాలికల విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచారన్నారు. సమాజం కోసం జీవించి, సమాజం కోసం చనిపోయిన వ్యక్తి మాత్రమే అసలైన సంఘ సంస్కర్త అని, ఆ ప్రమాణానికి పూర్తిగా సరిపోయిన తొలి వ్యక్తి సావిత్రిబాయి అన్నారు. ఆమె ఆశయాలు నేటి యువతరానికి మార్గదర్శకంగా మారాయన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈలు టి.సదర్ లాల్, కె.రాజు చౌహాన్, అశోక్, అన్నపూర్ణ, సురేందర్, సీజీఎం రవీంద్రనాథ్, చరణ్ దాస్, కిషన్, జాయింట్ సెక్రటరీలు కె.రమేశ్ , శ్రీకృష్ణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు వేణు బాబు, గిరిధర్, వాసుదేవ్, నాగ ప్రసాద్, వెంకట కృష్ణ, జయ రాజ్, కళాధర్, తదితరులు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి


