ఉత్సాహంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ స్టేడి యంలో వెటరన్ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దయాకర్ స్మారక రాష్ట్ర స్థాయి సీనియర్స్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు శని వారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ పోటీలను వీనస్ జువెల్లరీ అధి నేత రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో నిత్య సాధనతో ఆరోగ్యంగా ఉంటారనడానికి సీనియర్ క్రీడాకారులే నిదర్శనమన్నారు. వెటరన్ క్రీడాకారులను యువత ఆద ర్శంగా తీసుకోవాలన్నారు. వెటరన్ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 15 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. హనుమకొండ డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్, వెటరన్ సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, ఉమ్మడి వరంగల్ బాల్‌బ్యాడ్మింట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి. వీరన్న, కార్పొరేటర్ గుండేటి నరేందర్ పాల్గొన్నారు.


