ఐటీశాఖ జాయింట్‌ సెక్రటరీని మాట్లాడుతున్నా.. | - | Sakshi
Sakshi News home page

ఐటీశాఖ జాయింట్‌ సెక్రటరీని మాట్లాడుతున్నా..

Jan 3 2026 7:26 AM | Updated on Jan 3 2026 7:26 AM

ఐటీశా

ఐటీశాఖ జాయింట్‌ సెక్రటరీని మాట్లాడుతున్నా..

జిల్లా అధికారులకు బెదిరింపు ఫోన్లు

నిందితుడిపై కేసు నమోదు..

కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

భూపాలపల్లి అర్బన్‌ : ‘తెలంగాణ సెక్రటేరియట్‌కు చెందిన ఐటీ శాఖ జాయింట్‌ సెక్రటరీని మాట్లాడుతున్నా’ అంటూ వివిధ జిల్లాల అధికారులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాలడుతున్న వ్యక్తిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌ తాను రాష్ట్ర సచివాలయంలో జేసీని అని ప్రభుత్వ అధికారులకు ఫోన్‌ చేసి వారి వివరాలు అడగడం, ఆదేశాలు ఇవ్వడం, సరిగా పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో జిల్లాకు చెందిన పలువురు అధికారులు, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌ ఇటీవల ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టి రాజేంద్రప్రసాద్‌ను గుర్తించి శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ నరేష్‌కుమార్‌ తెలిపారు.

కిలోన్నర గంజాయి స్వాధీనం

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న కిలోన్నర ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రూరల్‌ ఎస్సై వి.దీపిక శుక్రవారం తెలిపారు. తనిఖీల్లో భాగంగా రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో వాహనాల తనిఖీ చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో ముత్యాలమ్మగూడెం శివారులో ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా అతడిని ఆపి పరిశీలించామని చెప్పారు. కాగా అతడి వద్ద కిలోన్నర ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గంజాయి విలువ రూ.75 వేలు ఉంటుందని, గంజాయి తరలిస్తున్న వ్యక్తి మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురం కాలనీకి చెందిన షేక్‌ జానీగా గుర్తించి కేసు నమోదు చేశామని తెలిపారు. అలాగే బైక్‌, సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశామని, అతడిని కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

గుట్కా పట్టివేత

వరంగల్‌ క్రైం : నగరంలోని టైలర్‌ స్ట్రీట్‌లో గల బాలాజీ కిరాణా షాపు గోదాంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు శుక్రవారం విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడి చేసి పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌ మచ్చ శివకుమార్‌ తెలిపారు. సుమారు రూ.5 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు షాపు నిర్వాహకుడు పవన్‌ ఉపాధ్యాయపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఎస్సై సతీష్‌, క్రైం పార్టీ రావుఫ్‌, అశోక్‌ పాల్గొన్నారు.

రేపు ‘బ్రహ్మం గారి

పద్యశతకం’ పుస్తకావిష్కరణ

హన్మకొండ కల్చరల్‌: కాకతీయ పద్యకవితా వేదిక వరంగల్‌ శాఖ ఆధ్వర్యంలో వరంగల్‌ భద్రకాళి రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ధ్యానమండపంలో హనుమకొండకు చెందిన విశ్రాంత భాషోపాధ్యాయుడు నర్సింగోజు లక్ష్మయ్య రచించిన ‘బ్రహ్మం గారి పద్య శతకము’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరుగుతుందని వేదిక అధ్యక్షుడు కంది శంకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఐటీశాఖ జాయింట్‌ సెక్రటరీని మాట్లాడుతున్నా..
1
1/1

ఐటీశాఖ జాయింట్‌ సెక్రటరీని మాట్లాడుతున్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement