హాస్టల్‌లో దాడి ఘటనపై విచారణ
కొడకండ్ల : జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థి ప్రభాకర్‌పై బయటి వ్యక్తి వచ్చి దాడి చేసిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం అధికారులు విచారణ చేపట్టారు. డీఎస్‌సీడీఓ విక్రం, ఏటీడీఓ హసీనా హాస్టల్‌కు వచ్చి బాధిత విద్యార్థితో పాటు సహచర విద్యార్థులు, సిబ్బందిని విచారించారు. దాడి ఘటన జరిగిన తీరుపై వివరాలు తెలుసుకుని విద్యార్థులు, సిబ్బంది వాంగ్మూలం తీసుకున్నారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని అధికారులు తెలిపారు. కాగా హాస్టల్‌లో విద్యార్థిపై దాడి చేసిన రోజు వార్డెన్ రాత్రి 9గంటల వరకు ఉన్నాడని, అదే సమయంలో వాచ్‌మెన్ బయటి వ్య క్తిని అడ్డుకొని బయటకు పంపాడని ఇద్దరి తప్పు లే దని చెప్పారు. విలేకరులు ఏదో రాశారని విద్యార్థులతో హాస్టల్ సిబ్బంది వాంగ్మూలం ఇప్పించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దాడి చేసిన వ్యక్తిపై కేసు
హాస్టల్‌లో విద్యార్థి ప్రభాకర్‌పై దాడి చేసిన పాకాల గ్రామానికి చెందిన నవీన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.


