ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గంగారం : మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గంగారం ఫారెస్టు అధికారులు మంగీలాల్, కర్ణనాయక్, సతీష్ సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మహదేవునిగూడ, జంగాలపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు పాదముద్రలను గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంగారం మండలంలోని మహదేవునిగూడ, జంగాలపల్లి, కామారం, దుబ్బగూడెం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. వ్యవసాయ పనులు చేసుకునే వారు, పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు అటవీ ప్రాంతానికి వెళ్లొదని హెచ్చరించారు. గ్రామాల్లో ఏమైనా ఆనవాళ్లకు సంబంధించి గుర్తులు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు.


