ఒకే శాఖ.. ఒకే వేతనం అమలు చేయాలి
కాజీపేట అర్బన్ : అర్చకులకు ఒకే శాఖ..ఒకే వేతన విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాజీపేట మండలం మడికొండలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక, ఉద్యోగుల సదస్సును పాతర్లపాడు నరేష్‌శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విశిష్ట అతిథిగా జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ముఖ్య అతిథిగా రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ హాజరై మాట్లాడారు. జీఓ 577 ప్రకారం 686 దేవాలయాల్లోని 2,223 మంది అర్చకులకు దేవాదాయ శాఖ అధికారులు అన్యాయంగా విస్మరించారని జేఏసీ రాష్ట చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. జీఓ 121ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అర్చకులకు కనీస వేతం రూ.1,500లు కూడా అందడం లేదని అందులో నుంచి 12శాతం ఈఏఎఫ్ ద్వారా జీతాలు పొందుతున్న అధికారులు మాత్రం ట్రెజరీ వేతనాలు, పెన్షన్లు, హెల్త్ కార్డులు పొందుతున్నారని జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు గ ట్టు శ్రీనివాసాచార్యులు, రవీంద్రాచార్యులు, వెల్ఫేర్ బోర్డు సభ్యులు కృష్ణమాచారి, శ్రావణ కుమారచారి, బ్రాహ్మణసేవా సంఘం కన్వీనర్ వల్లూరి పవన్‌కుమార్, జేఏసీ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌శర్మ, టక్కరి సత్యం, టీఎన్జీవోస్ నాయకులు ఆకుల రాజేందర్, సోమన్న తదితరులు పాల్గొన్నారు.
అర్చక జేఏసీ నాయకులు


