కలెక్టర్‌కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు
మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు గురువారం టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, ఉద్యోగులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాగబ్రహ్మచారి, వెంకటేశ్వర్లు, సురేష్, ఉద్యోగులు పాల్గొన్నారు.
పోలీసు అధికారులు,
సిబ్బందికి పతకాలు
అభినందించిన ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్తమ సేవా పతకం /సేవా పతకాలకు ఎంపికయ్యారు. జిల్లా నుంచి ఉత్తమ సేవా పతకానికి కె.పూర్ణచందర్ (ఏఆర్ ఎస్సై), ఎన్.నాగేశ్వర రావు (హెడ్ కానిస్టేబుల్, డీసీఆర్బీ)ఎంపికయ్యారు. అలాగే సేవా పతకానికి వి.విజయప్రతాప్ (ఏఆర్ డీఎస్పీ), ఎండీ.అలీంహుస్సేన్ (మహబూబాబాద్ టౌన్ ఎస్సై), డి.రామయ్య (వీఆర్ ఎస్సై), పి.రాజు (దంతాలపల్లి ఎస్సై), జె.వెంకటేశ్వర్లు (ఏఆర్ ఎస్సై), ఎ.బుచ్చిరెడ్డి (ఏఆర్ ఎస్సై), జి.యాదగిరి (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్), జి.చక్రపాణి (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్), టి.ఇందిర (డబ్ల్యూపీసీ, డీసీఆర్బీ) ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ పతకాలు సాధించిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ, భవిష్యత్‌లో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ చేతుల మీదుగా రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు జాతీయ భద్రతా అవగాహన మాసోత్సవాలు జరుగుతాయన్నారు. విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. మాసోత్సవాల తేదీల ప్రకారం తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించా లన్నారు. కార్యక్రమంలో ఎీస్పీ శబరీష్, ఆర్టీఓ జైపాల్‌రెడ్డి, ఎంవీఐ సాయిచరణ్, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల
తొర్రూరు రూరల్: తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసినట్లు కమిషనర్ శ్యాంసుందర్ చెప్పారు. గురువారం డివిజన్ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఓటర్లు రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ మేనేజర్ కట్టస్వామి, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.
మద్యం విక్రయాల జోరు
● మూడు రోజుల్లో రూ.17.58 కోట్ల
అమ్మకాలు
మహబూబాబాద్ రూరల్ : నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ నెల చివరి మూడు రోజుల్లో రూ.17.58 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు గురువారం తెలిపారు. సోమవారం రూ.7.13 కోట్లు, మంగళవారం రూ.4.40 కోట్లు, బుధవారం రూ.6.05 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు వరంగల్ పట్టణంలోని ఎకై ్సజ్ శాఖ డిపో నుంచి మద్యం వ్యాపారులు కొనుగోలు చేసిన నివేదికల ద్వారా తెలిసింది.
కలెక్టర్‌కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు
కలెక్టర్‌కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు


