వనదేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని వనదేవతలను దదగురువారం భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. న్యూ ఇయర్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి తరలివచ్చారు. స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద జల్లు స్నానాలు ఆచరించారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఒడిబియ్యం, గాజులు, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లకు పూజలు నిర్వహించినట్లు భక్తులు తెలిపారు. పూజారుల చేతుల మీదుగా నుదట బొట్టు పెట్టించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో వంటలు చేసుకుని భోజనాలు చేశారు.
వనదేవతలకు మొక్కులు


