
విధుల్లో నిజాయితీగా వ్యవహరించాలి
కేసముద్రం: పోలీసులు తమ విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ అన్నారు. కేసముద్రంలో ఇటీవల నూతనంగా ఏర్పాటైన సర్కిల్ పోలీస్‌స్టేషన్, కేసముద్రం, ఇనుగుర్తి పోలీస్‌స్టేషన్‌లను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. పోలీస్‌శాఖ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, చట్టవ్యవస్థను కాపాడడంలో కట్టుబడి ఉందన్నారు. ముందుగా సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డులను, పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సత్యనారాయణ, కేసముద్రం ఎస్సై క్రాంతికిరణ్, ఇనుగుర్తి ఎస్సై కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
హుండీ లెక్కింపు
గార్ల: మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం శని వారం దేవాలయం ప్రాంగణంలో దేవాదాయశాఖ కార్యనిర్వాహక అధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయం హుండీలను లెక్కించారు. ఈమేరకు రూ.2,58,731 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గూడూరు సంజీవరెడ్డి వెల్లడించారు. హుండీల లెక్కింపులో మల్లిబాబు, అశోక్, హరిలాల్, రాంసింగ్, కోట శ్రీను, అర్చకుడు అచ్చుతాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి
డోర్నకల్: మండల పరిషత్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేయాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం ఆదేశించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను జెడ్పీ సీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఆర్థికశాఖ ఆదేశాల మేరకు మండల పరిషత్ పరిధి లోని ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో తప్పులు లేకుండా సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు.ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం
భోజనం అందించాలి
మహబూబాబాద్: పిల్లలకు మెనూ ప్రకారం ప్రకారం భోజనం పెట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ న్యాయమూర్తి షాలిని సిబ్బందిని ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల బాల సదనాలను ఆమె సందర్శించి మాట్లాడారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు. పిల్లలతో కలిసి దీపావళి సంబురాలు జరుపుకున్నారు. బాలికలకు స్వీట్స్, చాక్లెట్లు అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలికల బాల సదనం సూపరింటెండెంట్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వాయిదాపడిన పరీక్షల రీషెడ్యూల్
కేయూ క్యాంపస్: తెలంగాణ బంద్ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన వివిధ పరీక్షల నిర్వహణ తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ పరీక్షల విభాగం అధికారులు శనివారం ప్రకటించారు. దూరవిద్య సీఎల్‌ఐఎస్‌సీ పరీక్షలను ఈనెల 24న, మూడేళ్ల లాకో ర్సు మొదటి, ఐదవ సెమిస్టర్ పరీక్షలు, ఐదేళ్ల లాకోర్సు ఐదవ, తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 21న నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల ఎమ్మెస్సీ బఝెటెక్నాలజీ, కెమిస్ట్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25న, ఎంటెక్ రెండవ సెమిస్టర్ పరీక్షను ఈనెల 31న నిర్వహించనున్నామని పేర్కొన్నారు.