
ముగిసిన వేంకటేశ్వరుడి పవళింపు సేవ
గార్ల: మండలంలోని మర్రిగూడెం స్వామివారి బ్రహ్మోత్సవాల అనంతరం గార్ల దేవాలయంలో వేంకటేశ్వరస్వామి సమేత శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాల పవళింపు సేవ శనివారం ముగిసింది. ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించిన ఊయలలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పడుకోబెట్టి కొనసాగించిన పవలింపు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యం పొందారు. బ్రహ్మోత్సవాల ముగింపు అనంతరం మాజీ సర్పంచ్ గంగావత్ లక్ష్మ ణ్‌నాయక్ దంపతులు అర్చకులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్, వేమిశెట్టి శ్రీనివాస్, పరుచూరి కుటుంబరావు, ఎం.రాములు, మహిళా భక్తులు కవిత, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
రామప్పలో విదేశీయుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో శిక్షణ పొందుతున్న టాంజనియా దేశానికి చెందిన 30 మంది అధికారులు సందర్శించారు. ప్రొఫెసర్, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో వారు రామప్ప ఆలయానికి చేరుకొని రామలింగేశ్వస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారులు రవి, సాయికృష్ణ, నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన వేంకటేశ్వరుడి పవళింపు సేవ